AP: తనకు సీఎం పదవి ప్రజలు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటున్నారని.. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది CBN, పవన్ కళ్యాణ్ అని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల్లో రప్పా రప్పా అని ప్రజలు వాళ్ల తాట తీశారని ఉద్ఘాటించారు. సీమ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.