KNR: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గందసిరి, పెద్దమండవ ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేశారు.