KDP: ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నేడు ప్రత్యేక విద్యుత్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నామని ట్రాన్స్కో ఏడీఈ కిరణ్ కుమార్ తెలిపారు. కాగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.