ASP: జీకేవీధి మండలం కే.కొడిశింగి గ్రామంలో గిరిజన విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు ఇళ్ల నుంచి పాఠశాలకు వెళ్లే రహదారి బురదమయమైంది. కొడిసింగి ఎంపీపీ పాఠశాలలో 32మంది విద్యార్థులు చదువుకుంటున్నారని స్థానికులు తెలిపారు. కిలోమీటరుదూరంలో పాఠశాల భవనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజూ విద్యార్థులు బురద దారిలో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.