అమెరికాలో ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉటా వ్యాలీలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు జరిపిన తుపాకీతో కాల్పుల్లో చార్లీ మృతిచెందాడు. అయితే, అతడు గతంలో భారతీయులకు వీసాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికా ఫుల్ అయ్యిందని, భారతీయులకు వీసాలు ఇవ్వొద్దని తెలిపాడు. హత్య నేపథ్యంలో గతంలో చార్లీ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.