ASR: ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో చింతపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచారు. మహేంద్ర పరుగు పందెంలో రజతం, జానీబాబు, మహేంద్ర జావెలిన్ త్రోలో కాంస్య పతకాలు సాధించారని ప్రిన్సిపాల్ మనోజ్ గురువారం తెలిపారు. చరణ్, దుర్గాప్రసాద్ తదితరులు వాలీబాల్, ఖోఖోల్లో ఉత్తమ ప్రతిభ కనపరచారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.