NRML: కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 697.275 అడుగుల వద్ద ఉండగా, నిల్వ 4.032 టీఎంసీగా ఉంది. గురువారం ప్రాజెక్ట్‌కు 38,353 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరగా, 3 గేట్ల ద్వారా 18,510 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎడమ కాల్వకు 800, కుడి కాల్వకు 9, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు కేటాయించినట్లు తెలిపారు.