KNR: ప్రభుత్వ కళాశాలలో బోటనీ విభాగం విద్యార్థులు తాజాగా విడుదలైన పీజీ ఎంట్రన్స్ టెస్ట్-2025లో ర్యాంకులు సాధించారు. అనుపురం శివ ప్రసాద్ 13వ ర్యాంకు, జాడి లక్ష్మి 47వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారు. విద్యార్థులను బోటనీ విభాగాధిపతి డా. తిరుకోవెల శ్రీనివాస్ అభినందించి సన్మానించారు.