MLG: జిల్లా వెంకటాపురం మండలంలో దారుణం జరిగింది. చొక్కాల గ్రామంలో మేనల్లుడి చేతిలో మేనత్త దారుణ హత్యకు గురైన ఘటన గురువారం ఉదయం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. కొండగొర్ల విజయ్ (35) తన మేనత్త ఎల్లక్క (55)ను కత్తితో పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసారు.