GNTR: ఫిరంగిపురం మండలంలోని కోనేరు వద్ద ఉన్న కొండవీడు రహదారి పూర్తిగా దెబ్బతింది. చిన్న వర్షానికే రోడ్డుపై గుంతలలో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వాహనదారుల పరిస్థితి అయితే చేప్పే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సంబధిత అధికారులు వెంటనే స్పందించాలనీ ప్రజలు కోరుతున్నారు.