అన్నమయ్య: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం పూతలపట్టు నియోజకవర్గ నాయకులు కలిశారు. వైపీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి పలు అంశాలను చర్చించారు. ఎంపీ మిథున్ రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించినట్లు తెలిపారు.