KDP: ఎర్రగుంట్ల -ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కిందపడి అరవింద్(21) మృతి చెందినట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, మృతుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.