అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు అవకాడోలో విటమిన్ K, రాగి, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.