PPM: జిల్లా గిరజన విద్యాసంస్థలను ఉపాధ్యాయులు కొరత వేధిస్తుందని గిరిజనసంఘ నాయకులు పాలక రంజిత్ అన్నారు. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఇలాకాలోని గిరిజన విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఐటీడిఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాశాలల్లో, ఎకోపాధ్యాయ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులు,అధ్యాపకులు లేరని పేర్కొన్నారు.