ASR: చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని కొయ్యూరు మండలం ఎం.మాకవరం గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాగ సుధ అన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేరు వేరుగా చెత్త బుట్టల్లో వేయాలని గ్రామస్తులకు సూచించారు. గురువారం ఉదయం నడింపాలెం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలని క్లాప్ మిత్రలకు తెలిపారు.