WGL: వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,555 పలకగా.. గురువారం రూ.7,545కి చేరింది. 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,600 పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.16వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.14,300 కి చేరింది. వర్షాలు నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ సరకులను మార్కెట్కు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.