కార్ల కంపెనీ ప్రచారంతో కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారనే కేసులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనెలకు ఊరట లభించింది. వారికి రాజస్థాన్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణకు ఈ నెల 25కు వాయిదా వేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్, దీపికాలపై ఆగస్టులో కేసు నమోదైంది. అయితే ఈ FIRను రద్దు చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు.