CTR: నగరి మున్సిపాలిటీ సత్రవాడలో గురువారం ఉదయం జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మావారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందుకున్నారు.