ప్రకాశం: త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో బుధవారం క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. CI అస్సన్ రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశాలపై పోలీసు సిబ్బందితో చర్చించారు. రాత్రి వేళల్లో దొంగతనాలు అరికట్టేందుకు అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు, గుడ్ & బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించాలని CI తెలియాజేశారు.