WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. మోసగాళ్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్లు మెసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ అకౌంట్‌తో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ స్పందించవద్దని హెచ్చరించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.