AP: చరిత్రలో తొలిసారి రాయలసీమలో 52 సీట్లకు 45 సీట్లు గెలిచామని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో 52కు 52 సీట్లు గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాయలసీమకు నీళ్లు తెచ్చింది TDP అని తెలిపారు. అనంతపురానికి కియా పరిశ్రమ తెచ్చి.. ఒక బ్రాండ్‌గా చేశానని.. అంతేకాకుండా అనంతపురం అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారుచేశానన్నారు. సీమలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతున్నామన్నారు.