ELR: గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్‌కు బుధవారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెల్లమెల్లి శివారు చింతాయిగూడెంలో డ్రైనేజీ సమస్య ఉందని జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని శ్రీను ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు పట్టించుకోవడం లేదన్నారు.