KRNL: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారానికై UTF ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19 వరకు జరిగే రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని UTF మండల అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు శంకరయ్య బుధవారం పిలుపునిచ్చారు. పెద్దకడబూరు ZPHS నందు రణభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. యాత్ర 15న కర్నూలు నుంచి ప్రారంభమై ఎమ్మిగనూరు చేరుకుంటుందన్నారు.