TPT: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘ డివిజన్ అధ్యక్షుడు పారిచర్ల శ్రీనివాసులు కోరారు. ఈ సదస్సు తిరుపతి జిల్లా గూడూరులో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవాళ గ్రామ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.