VZM: మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతి(సెప్టెంబర్ 21)ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆర్.మల్లికార్జున రావుని కలిసి వినతిపత్రం అందజేశారు.