MLG: ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి తుల రవి హాజరై మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని విస్మరించే సంతానంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వయోవృద్ధుల సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని తెలిపారు.