SRD: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని దళిత సంఘాల ఉమ్మడి జిల్లా నాయకుడు తలారి దేవరాజ్ అన్నారు. ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న యశ్వంత్, వసంతరావులకు బుధవారం రాత్రి ఖేడ్లో అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.