WNP: బుద్ధారం గురుకుల బాలికల కళాశాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం బాగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేల పాఠాలు బోధించాలని టీచర్లకు సూచించారు.