HYD: నగర శివారు చర్లపల్లిలో సకల సదుపాయాలతో రైల్వే టెర్మినల్ నిర్మించారు. ఈ నేపథ్యంలో అనేక రైళ్లును సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి తరలించారు. కానీ.. ఓ వైపు రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడం, మరోవైపు రోడ్లు ఇరుకుగా ఉండడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే రోడ్లు విస్తరించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.