SRD: కోహిర్ మండలంలోని పీచర్యాగడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాజకుమార్ బుధవారం సంగారెడ్డిలో జరిగిన జిల్లా టీఎల్ఎం మేళాలో తమ ప్రతిభను చాటారు. ఈ మేళాలో తెలుగు మల్టీ పర్పస్ TLMను చక్కగా ప్రదర్శించారు. ఈ మేరకు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, లింబాజీ ఈ తెలుగు మల్టీపర్పస్ టీఎల్ఎంను పరిశీలించి, వీటిని రూపొందించిన సంబంధిత ఉపాధ్యాయుడిని అభినందించారు.