KNR: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి, మల్లాపూర్, పర్లపల్లి, నుస్తులాపూర్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. బుధవారం ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాపులలో ఎరువుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలు, పురుగుల మందుల విక్రయాలపై అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తిమ్మాపూర్ మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు.