AP: సూపర్-6 అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ YCP ట్వీట్ చేసింది. దీపం పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట గాలికి వదిలేసిందంటూ YCP విమర్శించింది. మొదటి ఏడాది అరకొర ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదంటూ ఎద్దేవా చేసింది. ఈ పథకం కింద ప్రజలకు ప్రభుత్వం రూ.3,218 కోట్లు ఎగనామం పెట్టిందని ఆరోపించింది.