MBNR: పాలమూరు నగర పాలకసంస్థ పరిధిలోని ప్రతిడివిజన్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాతతోట పోచమ్మగుడి ఆవరణలో రూ.15లక్షల మూడా నిధులతో నూతనంగా కామన్ షెడ్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత BRS ప్రభుత్వ పదేళ్ల పాలనలో కుంటుపడిన అభివృద్ధిని 21నెలల ప్రజాపాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.