కృష్ణా: తాడేపల్లిలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ అనంతరం మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో జరుగుతున్న కూటమి వైఫల్యాలను ఆయన జగన్కు వివరించారు.