WGL: నల్లబెల్లి మండలంలో BRS మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ జడ్పీటీసీ పెద్ది స్వప్నపై కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ BRS నాయకులు బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన పిటిషన్లో కాంగ్రెస్ నేతలు సురేశ్, చల్ల ప్రవీణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.