ELR: ఈనెల 14న కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో జరగనున్న స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా సభను విజయవంతం చేయాలని కోరారు.