KNR: ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మానకొండూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలానికి చెందిన 100 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వంద మందికి 19వ విడతలో రూ. 33.31లక్షల మంజూరు చేయించారు.