ELR: గత నెల 31న ఏలూరు ఇందిరా కాలనీలో జరిగిన హత్య కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ఈ హత్య ఆధిపత్య పోరు వల్ల జరిగిందని విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురుపై పాత కేసులు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా రౌడీయిజానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.