KNR: సైదాపూర్లోని వెన్కెపల్లి విశాల పరపతి సహకార సంఘం వద్ద బుధవారం మహిళా రైతులు యూరియా కోసం ధర్నా చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు చేరుకొని మధ్యాహ్నం వరకు చెప్పులను క్యూలో పెట్టారు. కొంతమంది రైతులు టిఫిన్ బాక్సులతో వచ్చి సహకార సంఘం వద్దనే అన్నం తిన్నారు. సాయంత్రం వరకు యూరియా రాకపోవడంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.