యాదాద్రి: సిట్ కంప్యూటర్ శిక్షణ సంస్థలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో ఉచిత శిక్షణ పొందుటకు ఈ నెల 15 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ గంజి శ్రీరామ్ తెలిపారు. 19-35 సం.ల వయస్సు గల యువతి, యువకులు టెన్త్ అర్హత కలిగి ఉండాలని, ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. చౌటుప్పల్ కేంద్రంగా 3 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు.