ప్రకాశం: రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ పామూరు ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు నుంచి సంతకాల సేకరించి తాహాసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. షర్మిల మాట్లాడుతూ.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులు సబ్సిడీపై అందించాలన్నారు.