SDPT: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని సిద్దిపేట 20వ వార్డు కౌన్సిలర్ రియాజ్ అన్నారు. పట్టణంలోని 21 వార్డులోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులు, ఎగ్జామ్స్ ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ మీడియం పాఠశాలలో కిచెన్, టాయిలెట్లకు నిధుల మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.