KMR: బాన్సువాడ పట్టణంలోని R&B కార్యాలయం ముందు పిట్లం రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు జరిపించాలంటూ ఆర్అండ్బీ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే సోయి లేకుండా పోయిందని అన్నారు.