KMM: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఝార్ఖండ్ లో బుధవారం పర్యటించారు. అనంతరం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించారు.