CTR: చౌడేపల్లి నుంచి రాయలపేటకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని సత్వరమే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.