ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.