NLG: తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. నల్గొండ లోని సాగర్ రోడ్డులో ఉన్న రజక భవనం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.