MDK: నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం మెదక్ ఆర్డీవో రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో ఉన్నటువంటి సమస్యలను సత్వర పరిష్కారానికి దిశగా కృషి చేయాలన్నారు. సాదా బైనమా దరఖాస్తులను పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు.