ADB: బజార్ హత్నూర్ మండలంలోని మంజిరాం తాండ గ్రామంలో మథుర సమాజ్ వార్ నిర్వహించే ఋషి పంచమి వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్యావ్ సింగ్ మహరాజ్ సన్మానించి ఆశీర్వదించారు. మథుర సాంప్రదాయపు పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.