మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘దృశ్యం 3’. ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తయిందని దర్శకుడు తాజాగా వెల్లడించారు. అభిమానులకు డైరెక్టర్ ఓ ‘స్వీట్ వార్నింగ్’ కూడా ఇచ్చారు. ‘దృశ్యం 2’ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటే నిరాశ చెందుతారని అన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులను ఎలాంటి ఊహలు పెట్టుకోవద్దని ఆయన కోరారు.